నీ రూపమే ప్రాణాధారం ప్రియా...

WD

- గాయత్రి
నీలి ఆకాశంలో విహంగిలా ఎగురుతున్న నాకు
నీ తోడు దొరికింది
ఎడారిలా మారిన నా జీవితానికి
నీ నీడ కనబడింది
మార్గం తెలియని నా గమనానికి
నీ తోడే చుక్కానిగా మారింది
నిత్యం కనులు మూసి ధ్యానించే నా మనసుకు
నీ రూపమే ప్రాణాధారం ప్రియా...

వెబ్దునియా పై చదవండి