మనసు పలకరింపు...

Raju

సోమవారం, 30 జూన్ 2008 (20:37 IST)
నువ్వొస్తావు....
మలయ సమీరంతో మంద్ర మంద్రంగా
హొయలు హొయలుగా
కోటి ఊసులను మోసుకొస్తూ...

నువ్వొస్తావు..

మండువేసవిలో పండువెన్నెలలా
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహుకుహూలకు శ్రుతి సరిచేస్తూ
రతీ మన్మధంలాగా...

నువ్వొస్తావు

భావం, రాగం, తానం,పల్లవి
అన్ని తానైన ప్రణవనాదంలా
మంత్రజగత్తు సరిహద్దులను
సుతారంగా మీటుతూ
వెయ్యి వసంతాల చంద్రోదయంతో..

నువ్వొస్తావు

నువ్వూ నేనూ సంగమించే క్షణం...
నువ్వూ నేనూ ప్రణవించే క్షణం..
నువ్వూ నేనూ వూసులల్లుకునే క్షణం..

ఎదురుచూస్తూ నేను..
జాటాజూటధారి వదిలే గంగా ఝరిలా నువ్వు..

నువ్వొస్తావు...
అమరనాదాలను మోసుకొస్తూ..
నువ్వొస్తావు..

వెబ్దునియా పై చదవండి