రూపమే లేని రసరమ్య చిత్రం

WD

మంగళవారం, 4 మార్చి 2008 (14:00 IST)
FileFILE
గుండె దాటిన ఆరాటం,
నీ అధరాలకు గులామంటోంది.
ఉరకలేస్తున్న యవ్వనాశ్వం...
తొలి చుంబనపు మధురిమకై
పరుగెడుతోంది.

ప్రకృతిలోని అణువణువు...
మన పేర్లను నీలాకాశంలో లిఖిస్తున్నాయి
నీ క్రీగంటి చూపు,
హద్దులను దాటి...
ముద్దులతో పొద్దుపుచ్చమంటోంది.

కోరికలతో నిండిన...
బాహువుల్లో చేరి చెరి సగమై,
ఇరు పెదవులకూ తాళం వేద్దాం

అధరామృతాల వేడి,
రుధిరాన్ని రగిలిస్తున్నా...
హృదయం కరిగిపోతోంది,
ప్రేమ పరిష్వంగంలో.

దాహార్తితో...
కాగుతున్న అధరాలు,
మనస్సును మంచులా కరిగిస్తున్నాయి.

ఇరు దేహాల ఇంద్రజాలానికి,
ఏ పేరును పెట్టను?!
అధరామృతాల నుంచి జాలువారే
రసరమ్య చిత్రానికి
ఏ రూపమివ్వను?!
చెప్పవా ప్రియతమా!!!

వెబ్దునియా పై చదవండి