ప్రేమ సామ్రాజ్యంలో...

Munibabu

శుక్రవారం, 18 జులై 2008 (16:49 IST)
నా ప్రతి తలపు నీకోసం...
నా ప్రతి అడుగు నీకోసం...

నాలోని ప్రతిశ్వాస నీకోసం...
నాలోని ప్రతి అణువూ నీకోసం...

నే బ్రతికున్నది నీకోసం...
నే బ్రతుకుతున్నదీ నీకోసం...

నా నీరీక్షణ నీకోసం...
నే పడుతున్న తపన నీకోసం...

నాలో జ్వలించే ఆవేదన నీకోసం...
నేను ఇప్పటికీ ఎదురు చూస్తున్నది నీకోసం...

కొడిగడుతున్న నా ప్రాణం నిలుచున్నది నీకోసం...
మరణం సైతం నావద్దకు రాకున్నది నీకోసం...
కాదని నీవు నన్ను వదిలేస్తే (నే) మరణిస్తా నీకోసం.

వెబ్దునియా పై చదవండి