సన్యాసిగా చేరితే ప్రాణానికి హాయి

మంగళవారం, 25 మార్చి 2008 (21:05 IST)
"నీ గొంతెమ్మ కోరికలు తీర్చడం నా వల్ల కాదే... ఈ బాధ పడేదానికంటే ఏదైనా ఆశ్రమంలో చేరి సన్యాసం తీసుకుని ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది నాకు" విసిగిపోయిన భర్త భార్యతో అన్నాడు.

"మీరు ఆపని చేయండి చాలు. ఒక వేళ మీ తపస్సుకు మెచ్చి దేవుడు మీకు వరమిస్తే మనకు పెద్ద భవంతి, నా నడుముకు ఒక వడ్డాణం, మనకో వంద కోట్లు డబ్బు అడగండి సరిపోతుంది" అంటూ చాంతాడంత జాబితాను భర్త చేతిలో పెట్టింది భార్య.

వెబ్దునియా పై చదవండి