మహాశివరాత్రి రోజునే కాదు.. శివుడిని ప్రతిరోజూ పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోయేవిగా ఉండకూడదు.
కీటకాడులతో కొరకబడినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూతోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, మారేడు దళాలు, కుసుమపూవులతో శివపూజ చేయవచ్చు.