పహెల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాదులో కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క దెబ్బతో పాకిస్తాన్ దేశాన్ని రెండు ముక్కలు చేసేయండి. పాక్ ఆక్రమిత కాశ్మీరును భారతదేశంలో కలిపేయండి. కోట్లాది భారతీయులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మద్దతుగా వుంటారు.
1967, 1971లో పాకిస్తాన్ ఇటువంటి దాడులకు పాల్పడ్డప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసారు. ఇప్పుడు కూడా మీరు ఇదే చేయండి. అప్పుడు ఇందిరాగాంధీని వాజ్ పేయి దుర్గామాతతో పోల్చారు. మోడీజి దుర్గామాత భక్తుడు కనుక ఉగ్రమూకలకు గట్టి జవాబు చెప్పాలి అంటూ నినదించారు.