శివరాత్రి రోజున శివార్చన చేస్తే దారిద్ర్యము తొలగిపోతుందట.. కథేంటో తెలుసుకోండి..

గురువారం, 23 ఫిబ్రవరి 2017 (18:17 IST)
పూర్వం ఓ పేద బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని వద్ద విద్యాసంపద ఉన్నప్పటికీ దారిద్ర్యము వేధిస్తుండేది. ఎంత ప్రయత్నించినా చిల్లి గవ్వైనా దొరికేది కాదు. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా ఉండేది. ఎవరినీ యాచించకుండా ఉండేందుకు పెళ్లి కూడా చేసుకోని ఆ బ్రాహ్మణుడు జీవితంపై విరక్తితో ఆత్మత్యాగం చేసుకోవాలని భావించి ఓ రాత్రి నిద్రపోయాడు. 
 
ఆ సమయాన నిద్రలో ఆ పండితునికి పరమేశ్వరి సాక్షాత్కరించింది. ఓయీ పండితోత్తమా.. ప్రాణం తీసుకోవాలని ఎందుకు పాకులాడుతావ్. సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కలను చెప్పుకుంటాడు. ఏం చేయాలని అడుగుతాడు. 
 
ఆ పండితుడు జగదాంబ నిన్ను కరుణించింది కాబట్టి.. శివునికి ప్రీతికరమైన శివరాత్రి రోజున నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించమని సలహా ఇస్తాడు. అలా శివరాత్రి పూజ చేసిన ఆ పండితుడు... మరుసటి రోజు తనకు శక్తికి మేర ఫలాన్ని దానం చేస్తాడు. ఇలా ఆ పండితుడు దారిద్ర్యమును పోగొట్టుకుంటాడు. ఆరోగ్య వంతుడవుతాడు.

వెబ్దునియా పై చదవండి