ప్రకాశం జిల్లాలో పెళ్లిలో ఓ వింత ఆచారం ఉంది. అబ్బాయి వధువుగాను, అమ్మాయి వరుడుగా వస్త్రాధరణ చేసి రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మా నాగార్జునకు వై.పాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రతో పెళ్ళి జరిగింది. ఆచారం ప్రకారం అబ్బాయి పెళ్లి కుమార్తెగా, అమ్మాయి పెళ్లి కుమారుడుగా దుస్తులు ధరించుకుని నాగులపుట్ట వద్ద పూజలు చేశారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో పాటు త్వరగా సంతానం కలుగుతుందని వారి మూఢ నమ్మకం.
ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో ఒక వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ప్రియురాలితో భర్త ఉన్నట్టు భార్యకు ఎవరో సమాచారం అందించారు. దీంతో భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా పట్టుకుని దేహశుద్ధి చేశారు.
భర్త వేణుకుమార్ తన ప్రియురాలితో ఉన్నాడని సమాచారం అందుకున్న భార్య, వెంటనే బంధువులతో కలిసి గంధంకూడకు చేరుకుంది. అక్కడ తన భర్త ప్రియురాలితో ఉండటం చూసి ఆగ్రహించిన ఆమె.. అతనికి దేహశుద్ధి చేసి నార్శింగి పోలీసులకు అప్పగించింది. తన భర్త తనను మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలిని కోరుతోంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుపడేలా లైంగికంగా వేధిస్తున్న భర్తపై విజయవాడ అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయోధ్య నగర్‌కు చెందిన యువతి.. న్యూగిరిపురానికి చెందిన అనిల్ కుమార్‌ను 2008లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఈమె, ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్.ఆర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. భర్త పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. కొంతకాలం బాగానే చూసుకున్నాడు. తర్వాత కట్నం తీసుకునిరావాలని వేధిస్తుండడంతో రూ.20 లక్షల వరకు తెచ్చారు. అయిన ప్రవర్తన మార్చుకోకుండా వధిస్తున్నాడు.
వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికే ప్రవర్తనతో వేధించేవాడని, నిరాకరించడంతో ఒక రోజు ఇంట్లో గ్యాస్ వదిలేసి చంపుతానని బెదిరించాడు. మామ కూడా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం
అబ్బాయి వధువుగా, అమ్మాయి వరుడిగా పూజలు
మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మా నాగార్జునకు.. వై పాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రతో పెళ్లి జరిగింది
ఆచారం ప్రకారం అబ్బాయి పెళ్లి కుమార్తెగా, అమ్మాయి పెళ్లి కుమారుడిగా బట్టలు వేసుకొని… pic.twitter.com/L4chVSDojc