మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలి?

సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:33 IST)
మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు : నాలుగు కప్పులు 
సగ్గు బియ్యం : ఒక కప్పు 
పంచదార : 3/4 కప్పులు 
ఏలకుల పొడి : పావు టీ స్పూన్ 
నీరు : ఒక కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా సగ్గు బియ్యాన్ని నీటిలో శుభ్రం చేసి పది నిమిషాల పాటు ఊరనివ్వాలి. తర్వాత నీటిని వేడి చేసి అందులో సగ్గు బియ్యంను వేసి ఉడికించాలి. తర్వాత అందులో పాలు పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఇందులోనే యాలకుల పొడి చేర్చాలి. అంతే జీడిపప్పు, ద్రాక్ష లేకుంటే డ్రై ఫ్రూట్స్‌ని కూడా నేతిలో వేయించి.. మహాశివుడికి నైవేద్యంగా సమర్పించి ఆరగించవచ్చును.

వెబ్దునియా పై చదవండి