మహాశివరాత్రి పర్వదినాన్ని భారతీయులు పాకిస్థాన్‌లో జరుపుకుంటున్నారు. ఉగ్రవాదం దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య పెద్ద సవాలుగా పరిణమించిన నేపథ్యంలో.. హిందూ దేశంగా పేరుగాంచిన భారత దేశం నుంచి అత్యధిక సంఖ్యలో మహాశివరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు పాకిస్థాన్‌కు వెళుతున్నారట.
మన దేశంలో లెక్కకు మించిన ప్రపంచ ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఉన్నాయి. కాశీలాంటి పుణ్యక్షేత్రాలు ఇందుకు నిదర్శనం. అలాగే ఇస్లాం మతానికి కేంద్రంలా వెలుగొందుతున్న పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు తక్కువ.
ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడానికి ఓ హిందూ భక్త బృందం పాకిస్తాన్‌కు ప్రయాణమైంది. ఆశ్చర్యంగా ఉందా.. ఇంకా చదవండి.. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం కటాస్ గ్రామంలో ఓ శివాలయం ఉంది.
దీనిని కటాస్ రాజ్ దేవాలయం అంటారు. మహాభారత కాలంలో అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు కొన్నాళ్లు ఇక్కడ గడిపారనేది స్థలపురాణం. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయ పునరుద్ధరణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే భారీ మొత్తంలో నిధులు కేటాయించింది.
మహాశివరాత్రి రోజున పాకిస్థాన్‌లోని హిందువులంతా దర్శించుకొనే ఈ ఆలయాన్ని సందర్శించడం కోసం భారతీయ హిందూ భక్త బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిక కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.