సర్వత్రా అనుకూలం. పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
రావలసిన ధనం అందుతుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు.
ఆర్ధికలావాదేవీలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విమర్శలు పట్టించుకోవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం ఉంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ప్రయాణం చికాకుపరుస్తుంది.
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లావాదేవీలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి.