మహాశివరాత్రి రోజున శివునికి బిల్వార్చన చేయిస్తే..?
గురువారం, 7 మార్చి 2013 (16:50 IST)
FILE
కుశ లేదా దర్భ అనే ప్రత్యేక గడ్డి జాతి మొక్క వివిధ కర్మకాండలలో పవిత్రంగా భావిస్తారు. పవిత్రతకు, దివ్యత్వానికి చిహ్నమైన కుశ సరస్వతికి ప్రీతికరం. ఆమెనే ఐలా, భారతి అనీ అంటారు. వృక్షాలలో దర్భనే మొదట సృష్టించినట్లు ఆధారాలున్నాయి.
శ్రాద్ద కర్మలు తదితర సందర్భాలలో దర్భల ఉంగరాలను కర్మ ఆచరించేవారు ధరిస్తారు. దీనితో తయారుచేసిన దర్భాసనాలను ధ్యానానికి ఉపయోగిస్తారు.
అలాగే శివ-పార్వతుల ఆరాధనలో బిల్వ పత్రాలను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. సృష్టి స్థితి లయలకు సంకేతంగా త్రిశూలాకారంలో వుండే మారేడు దళాలతో శివుని ఆరాధిస్తారు. ఈ బిల్వ దళాలంటే శివునికి ప్రీతికరం
అందుకే మహాశివరాత్రి రోజున బిల్వార్చన చేసేవారికి సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. బిల్వ పత్రాలను, బిల్వ పుష్పాలను పరమేశ్వరునికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.