అఖిలపక్ష సమావేశానికి బీఎస్పీ డిమాండ్

శనివారం, 5 జులై 2008 (11:39 IST)
వివాదాస్పద అణు ఒప్పందంపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి అభిప్రాయపడ్డారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం ముందడుగు వేసే ముందు అణు ఒప్పంద లాభనష్టాలను దేశ ప్రజలకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.

తమ పార్టీతో సహా మరిన్ని పార్టీలు అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఇది దేశ సార్వభౌమత్వానికి హానికరం లాంటిందని ఆమె అన్నారు. ముఖ్యంగా సమాజంలోని ఒక వర్గానికి చెందిన ప్రజల్లో అయోమయం, అపార్థాలు నెలకొని ఉన్నాయని ఆమె అన్నారు. అణు ఒప్పందంపై ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవడాన్ని మాయావతి తప్పుపట్టారు.

ఇది ఆరోగ్యకరమైన రాజకీయ పొత్తు కాదన్నారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ములాయం సింగ్ ప్రాధాన్యత ఇస్తున్నారని మాయావతి ఆరోపించారు. పార్లమెంట్‌లో జరిగే విశ్వాస పరీక్షలో తమ పార్టీ వైఖరి స్పష్టమవుతుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి