ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే ఫలితాలపై నమ్మకం లేదు: కరుణానిధి

గురువారం, 25 మార్చి 2010 (09:52 IST)
ఎన్నికలకు ముందు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలపై తనకు నమ్మకం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. ప్రభుత్వ, అభ్యర్థుల పనితీరు ఆధారంగా ఓటర్లు పట్టంకడతారని ఆయన చెప్పుకొచ్చారు.

ఈనెల 27వ తేదీన జరుగనున్న ధర్మపురి జిల్లా పెన్నాగరం అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ పూర్తికాక ముందే ఎవరికి మెజారిటీ వస్తుందనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటారు. దీన్ని పూర్తిగా అంగీకరించలేం. ఒక్కోసారి ఈ ఫలితాలు అనుకూలంగానూ.. మరొకసారి ప్రతికూలంగా ఉండవచ్చన్నారు.

ప్రస్తుతం పెన్నాగరం ఉప ఎన్నిక ఫలితాలపై నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేలో డీఎంకేకు ఎపుడు కూడా అగ్రస్థానమే లభిస్తుంది. పీఎంకేకు రెండో స్థానం, అన్నాడీఎంకేకు మూడు, డీఎండీకేకు నాలుగో స్థానాలు దక్కాయన్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేను మూడో స్థానానికే పరిమితం చేయడం పట్ల తాను బాధపడుతున్నట్టు చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి