గుజరాత్‌లో బంగ్లాదేశ్ జాతీయుడి అరెస్టు

గురువారం, 13 ఆగస్టు 2009 (16:12 IST)
దేశంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడిని గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేసింది. నిందితుడిని అస్గర్‌ అలీ‌గా గుర్తించగా, అతని నుంచి 1.35 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని ఏటీఎస్ బృందం స్వాధీనం చేసుకుంది.

బంగ్లాదేశ్‌ జాతీయునిగా గుర్తించిన అస్గర్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ పాస్ పోర్టులను కలిగి ఉన్నట్టు ఏటీఎస్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, అస్గర్ పాకిస్థాన్‌కు తరచూ వెళ్లే సందర్శకుడిగా తేలింది.

అస్గర్ అరెస్టుతో దేశంలో నకిలీ నోట్ల చెలామణీలో పాకిస్థాన్ కుట్ర బట్టబయలైంది. పాకిస్థాన్‌కు సంఘ విద్రోహశక్తులు కొన్ని దేశంలోకి నకిలీ నోట్లను సరఫరా చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని కుట్ర పన్నినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి