నియంత్రణ రేఖపై చొరబాట్లు పెరిగాయి: ఆర్మీ

పాకిస్థాన్‌వైపు నుంచి జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి సరిహద్దు చొరబాట్లు తీవ్రంగా పెరిగాయని ఆర్మీ వెల్లడించింది. శీతాకాలం రావడానికి ఎంతో సమయం లేకపోవడంతో.. పాక్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు ఉధృతమయ్యాయని ఆర్మీ అధికారులు చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని భారత్‌లోకి చొరబడేలా చేసేందుకు పాక్‌వైపు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై జులై, ఆగస్టు నెలల్లో 12 చొరబాటు యత్నాలు జరిగాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా జులై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థలు శీతాకాలంలోగా సాధ్యమైనంత ఎక్కువమంది మిలిటెంట్లను భారత్‌‍లోకి చొరబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి