పార్లమెంటు ఆమోదం కోసం అణు పరిహార బిల్లు

ఆది నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్న అణు పరిహార బిల్లును ఆమోదింప చేసేందుకు కేంద్రం పార్లమెంటు ముందు బిల్లును ఉంచింది. అణు పరిహారం విషయంలో పలు అనుమానాలున్నాయనీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మొదట్నుంచీ చెపుతున్నాయి. క్లాజ్ 17 (బి) మరియు (సి)లలో "ఇంటెంట్" అనే సందేహాస్పదంగా ఉన్న పదంతోపాటు మరికొన్ని పదాలను ముసాయిదా నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.

ప్రతిపక్షాల మద్దతు లేనిదే బిల్లు ఆమోదం దుర్లభం కనుక ప్రభుత్వం భాజపా డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని యూపీఎ ప్రభుత్వం ముసాయిదాలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ప్రమాదం ఉద్దేశ్య పూర్వకంగా జరిగినా లేదా జరగపోయినా పరిహారం చెల్లించాలని ముసాయిదాలో జోడించింది.

అయితే ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని వామపక్షాలు తేల్చి చెప్పాయి. పరిహారం విషయంలో ఎన్నో అనుమానాలున్నాయని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. తాము చెప్పిన మార్పులను కూడా చేసినట్లయితే మద్దతుపై పరీశీలన చేస్తామని చెపుతున్నాయి.

మొత్తమ్మీద ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ డిమాండ్లను అనుసరించి అణు పరిహార బిల్లులో మార్పులు చేయడంతో బిల్లు ఆమోదం పొందుతుందని యూపీఎ ప్రభుత్వం విశ్వసిస్తోంది.

వెబ్దునియా పై చదవండి