లోక్‌పాల్ బిల్లు ఆమోదం యోగ్యం కాదు: అన్నా హజారే

ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లు తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలోని పౌర సమాజ బృందం స్పష్టం చేసింది. అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పౌర సమాజ బృందం తేల్చి చెప్పింది.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు పేదలకు, రైతులకు వ్యతిరేకంగా ఉందని, తాము సూచించిన చాలా అంశాలను ఈ బిల్లులో పొందుపర్చలేదని, కనుక పౌర సమాజానికి ఈ బిల్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని సమాచార హక్కు కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును తీసుకువచ్చేందుకు ఉద్యమిస్తున్న అన్నా హజారేకి సమాజంలోని అన్ని వర్గాలు బ్రహ్మరథం పడుతున్నాయని, ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన నిర్వహించ తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షలో ఎటువంటి మార్పు లేదని కేజ్రీవాల్ తెలిపారు.

ఇదిలావుంటే, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లును బుధవారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా వ్యతిరేకించాల్సిందిగా ఎంపీలకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి