లోక్‌సభ సభ్యుడే ప్రధానమంత్రి కావాలి: పీఏ.సంగ్మా

సోమవారం, 1 ఫిబ్రవరి 2010 (10:22 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన దేశంలో ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన (లోక్‌సభ) అభ్యర్థే ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా తెలిపారు. గోవాలో జరిగిన ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

భారత్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో ఏర్పడే లోక్‌సభ నుంచి ప్రధాని ప్రాతినిథ్యం వహించజాలని పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకెంతో విశ్వాసముందని, అందుకే లోక్‌సభ సభ్యుడే ప్రధాని కావాలని బలంగా నమ్ముతానని సంగ్మా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో గత 15 సంవత్సరాలుగా తానెంతో చెందుతున్నానని చెప్పారు. 1996లో కర్ణాటక నుంచి హెచ్‌.డి.దేవెగౌడను ప్రధాని పదవికి అరువు తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. 2009 సంవత్సరంలో లోక్‌సభకు ఎన్నికైన ఏ ఒక్కరూ ప్రధాని పదవికి అర్హులుగా నిలువలేక పోయారని, చివరకు రాజ్యసభ నుంచి మన్మోహన్‌సింగ్‌ను దేశ ప్రధానిగా ఎన్నుకోవాల్సి దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి