వనిత మాజీ భర్త ఆకాష్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం!

మద్రాసు కోర్టులో శ్రీహరి వ్యవహారంపై నడుస్తున్న కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ సినీనటి వనిత తండ్రి, తమిళ నటుడు విజయ్ తుమార్ అల్లుడు ఆకాష్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో తన కుమారుడు విజయ్ శ్రీహరి కస్టడీ విషయంలో తమిళనటి వనితకు ఊరట లభించింది.

ఆకాశ్‌తో విడాకులు తీసుకున్న వనిత తన తండ్రి విజయ్ కుమార్‌ తన కుమారుడు శ్రీహరిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో మద్రాసు కోర్టులో నడుస్తున్న శ్రీహరి కేసుపై స్టే ఇవ్వాలని ఆకాష్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టిపారేసింది. కుమారుడికి న్యాయపరమైన సంరక్షుకురాలు తల్లి అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు శుక్రవారం వనిత మీడియా ప్రతినిధులతో వెల్లడించింది.

తనపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆకాష్ తన తండ్రి విజయ్ కుమార్ చెంత చేరాడని ఆమె ఆరోపించింది. కుమారుడిని తనకు అప్పగించాలని కూడా కోర్టు చెప్పడం ద్వారా తనకు న్యాయం జరిగిందని వనిత చెప్పింది

వెబ్దునియా పై చదవండి