ఇంకా రక్షణ, విమానయాన రంగాల్లో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నట్లు కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రకటించింది. ఫార్మా సెక్టార్లోకి 74 శాతం వరకు ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్నట్లు మోడీ సర్కారు పేర్కొంది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో 49 శాతం వరకు మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతించేవారని కానీ ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలు భారత్‌కు వరుసకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.