శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 14 మంది ఏక్‌నాథ్ షిండే, భాజపాతో టచ్‌లో ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా షిండే వర్గంలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. అదే నిజమైతే, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తోన్న షిండేకు మరింత బలం చేకూరినట్లవుతుంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులున్నారు. వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి షిండే నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అసలైన శివసేన పార్టీ తమదేనని, అసెంబ్లీలో తమ వర్గాన్నే శివసేనగా గుర్తించాలని షిండే కోరుతున్నారు.