టెహ్రాన్‌కు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో విమానం దిగాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పైలట్ అత్యవసరంగా అల్‌బోర్జ్ ప్రావిన్సులోని ఫత్ విమానాశ్రయంలో దించాడు. రన్‌వే పై దిగుతున్న క్రమంలో విమానం అదుపుతప్పి పూర్తిగా ఓ పక్కకు ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.