కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతరాత్రి భోజనంలో వడ్డించిన చేప కారణంగా వారి ఆరోగ్యం ఉన్నట్లుండి తిరగబెట్టి ఉండొచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.