బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి 17 మంది మృత్యువాతపడ్డారు. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కురిసిన భారీ వర్షానికి భాగల్‌పూర్‌లో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు ఖగారియాలో ఇద్దరు, బంకాలో ఇద్దరు, కతిహార్‌లో ఒకరు, నహర్సాలో ఒకరు, మాధేపురాలో ఒకరు, ముంగేర్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య తీర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.