ఆ వ్యాపార వేత్తల నుంచి రూ. 18 వేల కోట్లు వసూలు చేశాం..

గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:20 IST)
దేశంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలామంది వ్యాపార వేత్తలు పెట్టుబడుల కోసం బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం.. వాటిని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం జరుగుతూ వుంది.
 
ఇలాంటి వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ‌లు వున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు వీరికి కొమ్ము కాస్తున్నారు. లేదంటే వీరికి ఉన్న ఆస్తులను జప్తు చేయొచ్చు కదా అంటూ వివిధ విమర్శలు, ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
అయితే నేడు ఆ విమర్శలు అన్నింటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాపార వేత్తలకు సంబంధించి తీసుకున్న మొత్తం అప్పుల్లో రూ. 18 వేల కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలెక్ట్ చేసిందని భారత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 
 
ఇప్పటి వరకు అక్రమ నగదు చలామణి చట్టం కింద 4700 కేసులను ఈడి విచారించింది. ఈ కేసులు అన్నింటిలోనూ రూ. 67 వేల కోట్ల వరకు వారి నుండి స్వాధీనం చేకున్నామని వివరాలతో సహా సుప్రీం కోర్టుకు తెలిపింది.
 
ఇప్పటికే మనము అనుకున్న విధంగా ఈడికి ఇచ్చిన అధికారాలను పలువురు ప్రశ్నిస్తూ పెట్టిన కేసులపై నిన్న సుప్రీం కోర్టు విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా కేంద్రం ఈ విషయాలను సుప్రీం కోర్టు కు అందచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు