స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో యువత పెడదోవ పడుతున్నారు. తాము అనుకున్నది సాధించుకోవడం కోసం తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నారు. ఇలాంటి ఘటనే యూపీలోని ఘజియాబాద్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మరో యువతితో అఫైర్ పెట్టుకుంది. ఈ అఫైర్‌ను సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. చివరికి తల్లినే ఆ యువతి హతమార్చింది.
వివరాల్లోకి వెళితే.. మహిళా టీచర్‌తో సంబంధం పెట్టుకోవద్దని తల్లి హెచ్చరించడంతో 18ఏళ్ల యువతి ఈ నెల 9న 38 ఏళ్ల తల్లిని కర్ర, ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హతమార్చింది. మహిళా టీచర్‌తో కలిసి వుండటానికి నిందితురాలి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో తల్లిని చంపి పారిపోదామనుకుంది. ఈ ఘటనపై నిందితురాలిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తల్లిని హతమార్చిన యువతిని అరెస్ట్ చేశారు. అలాగే నిందితురాలైన యువతితో సంబంధం పెట్టుకున్న టీచర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.