జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ - ఉగ్రవాదుల హతం

ఆదివారం, 12 జూన్ 2022 (09:57 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. పూల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే, శనివారం సాయంత్రం జరిగిన మరో ఘటనలో మరో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముష్కరులంతా లష్కర్ తోయిబా సంస్థకు చెందిన వారేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఉగ్రవాదులను ఫాజిల్ నజీర్ భ ట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షిర్గోజీలుగా గుర్తించామన్నారు. కాగా, ఈ నెల 13వ తేదీన అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపిన వారిలో జునైద్ కూడా ఉన్నాడని, పైగా, వీరంతా స్థానిక పౌరులేనని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు