శ్రీలంక పేలుళ్లలో జేడీఎస్ నేతలు మృతి... మరికొందరు మిస్సింగ్

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:25 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుసబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 250 మంది వరకు చనిపోయారు. మరికొంతమంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ పేలుళ్ళలో చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. విహార యాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు ఆచూకీ తెలియకపోవడమే. 
 
ఇదే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ ట్వీట్ చేశారు. "తమ పార్టీ జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌)కు చెందిన ఏడుగురు నేతలు శ్రీలంకలో అదృశ్యమయ్యారు. ఎన్నికల ప్రచారం అనంతరం మారెగౌడ, పుట్టారాజు, శివణ్ణ, లక్ష్మీనారాయణ, హనుమంతరాయప్ప, రమేష్‌, రంగప్పలు ఈనెల 20న శ్రీలంక వెళ్లారు. బాంబు పేలుళ్లు జరిగిన కొలంబోలోని ద షాంగ్రిలా హోటల్‌లోనే వీరు బస చేసినట్టు తెలిసింది. పేలుళ్లు జరిగిన తర్వాత వీరు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఏడుగురిలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు