ఢిల్లీలో అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై 40 ఏళ్ల స్వీపర్ అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. నాలుగేళ్ల బాలిక అత్యాచారానికి గురై, తీవ్రంగా గాయపడ్డ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ వివరాలను పరిశీలిస్తే...ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్‌కు చెందిన బల్దేవ్ ఢిల్లీకి వలసవచ్చి వికాస్ పురిలోని ఓ స్కూలులో గత 15 ఏళ్లుగా స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఎట్టకేలకు నేరం అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బల్దేవ్ పై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.