తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ మేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి ఫిల్మ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు.
ఓంప్రకాష్ విజువల్స్, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ కానుంది. ఈ చిత్రానికి ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ - తెలుగు) సినిమాలో భాగమయ్యారు.