హల్ద్‌వాని జైలులో 44 మంది ఖైదీలకు హెచ్.ఐ.వి పాజిటివ్

సోమవారం, 10 ఏప్రియల్ 2023 (11:35 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్‌వాని జైలులో ఉండే ఖైదీల్లో 44 మందికి హెచ్.ఐ.వి వైరస్ సోకింది. ఇది స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో 44 మందికి హైచ్.ఐ.వి సోకిందని వీరిలో ఓ మహిళ ఖైదీ కూడా ఉండటం గమనార్హం. జైలులో ఎయిడ్స్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుల కోసం అక్కడే ఏఆర్‌టీ కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్టు సుశీలా తివారీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నిబంధనల ప్రకారం వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
 
అయితే, హెచ్.ఐ.వి. సోకినవారంతా డ్రగ్స్ బానిసలేనని తెలిపారు. జైలులో ప్రస్తుతం 1629 మంది పురుష, 70 మంది మహిళలు ఖైదీలు ఉన్నారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ఖైదీలు ఈ అంటు వ్యాధిబారిన పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు. దీంతో క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నారని, దీనివల్ల వైరస్ బారినపడిన వారిని గుర్తించి చికిత్స అందించడానికి అవకాశం ఏర్పడిందని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు