Bengaluru: బెంగళూరులో ఘోరం... తొమ్మిదేళ్ల బాలికను ఢీకొన్న బస్సు.. ఏమైంది?

సెల్వి

శనివారం, 11 అక్టోబరు 2025 (19:02 IST)
బెంగళూరులో ఘోరం జరిగింది. బెంగళూరు బస్సు కింద పడి తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి చెందిన బస్సు బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లేఅవుట్‌లోని భోవిపాల్య నివాసి భువన అనే తొమ్మిదేళ్ల బాలికను ఢీకొంది.
 
ఆ బాలిక తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ ట్యూషన్‌కు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా బీఎంటీసీ బస్సు ఆమెను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన రాజాజీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
మృతురాలు భువన పాంచజన్య విద్యాపీఠ విద్యార్థిని. బాలిక పాఠశాల నుండి తిరిగి వస్తుండగా, రోడ్డు దాటుతుండగా బీఎంటీసీ బస్సు ఆమెను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు