పెళ్ళి చేసుకున్నాడు.. ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. ఆ తరువాత..?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (14:51 IST)
సత్సంబంధాలు ఎప్పుడూ మేలే చేస్తాయి. తప్పుడు సంబంధాలు మాత్రం కష్టాలు తెచ్చిపెడతాయి. తెలిసి తెలిసి పాపాలు చేస్తే వాటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. సాఫీగా సాగిపోతున్న సంసారంలో ఇద్దరు మహిళలు ప్రవేశించారు. పెళ్ళయిన వ్యక్తిని మభ్యపెట్టి తమవైపు తిప్పుకున్నారు. అక్రమ సంబంధాలు కాస్తా చివరకు స్లో పాయిజన్‌లా మారి హత్యకు దారితీసింది.
 
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతానికి చెందిన సత్యన్ అనే వ్యక్తి స్థానికంగా కిరాణా కొట్టును నడుపుతున్నాడు. 5 సంవత్సరాల క్రితం సత్యన్‌కు వివాహమైంది. ఒక కొడుకు ఉన్నాడు. కన్యాకుమారికి సమీపంలోని బిల్వరాజపల్లి అనే ప్రాంతానికి చెందిన రాధ తన భర్తతో విడాకులు తీసుకుని కన్యాకుమారికి వచ్చేసింది.
 
అక్కడ ఒక ఫ్యాక్టరీలో ఉంటూ జీవనం సాగిస్తుండేది. కిరాణా కొట్టు సత్యన్‌తో రాధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో సత్యన్ తన అపార్టుమెంట్‌లో ఒక పోర్షన్‌ను ఆమెకు ఇచ్చాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సంవత్సరం పాటు వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగింది. కళ్యాణి అనే మహిళ తన భర్తతో గొడవపడి రాధ పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే వచ్చి చేరింది. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కళ్యాణికి రాధ సత్యన్ గురించి అన్ని విషయాలు చెప్పింది. దీంతో కళ్యాణి కూడా సత్యన్‌ను బుట్టలో వేసుకుంది. రాధను ఎలాగోలా ఒప్పించి ఆమె ఉన్న అపార్టుమెంట్‌లోని మరో పోర్షన్‌ని సత్యన్ కళ్యాణికి ఇచ్చాడు.
 
ఇలా రెండుసంవత్సరాల పాటు అతడు వీరిద్దరితోనూ అక్రమ సంబంధం కొనసాగించాడు. కానీ ఈ విషయం సత్యన్ భార్యకు తెలియదు. ఐతే సత్యన్, రాధ, కళ్యాణిల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కారణం కళ్యాణికి సత్యన్ బాగా దగ్గరవ్వడం.. ఆమెకు బంగారు ఆభరణాలు కొని పెట్టడం లాంటివి చేసేవాడు. రాధకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో కళ్యాణిపై సత్యన్‌కు చాడీలు చెప్పేది రాధ. ఎలాగైనా ఆమెను దూరం చేయాలని ప్లాన్ చేసింది. అది కాస్త ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
 
రాధ నుంచి సత్యన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో కళ్యాణి, సత్యన్‌లు ప్లాన్ చేశారు. ఎలాగైనా రాధను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా వేసుకున్న ప్లాను ప్రకారం వంటగదిలో ఉపయోగించే కత్తితో రాధ పీక కోసేశాడు సత్యన్. హత్య సమయంలో కళ్యాణి కూడా అతడికి సహకరించింది. రాధను హత్య చేసి తప్పించుకోవాలని చూశారు. కానీ పోలీసులు విచారించడం మొదలెట్టారు. సత్యన్, కళ్యాణిలు తమకేం తెలియదని బుకాయించారు. చివరకు పోలీసులు థర్డీ డిగ్రీ ప్రయోగిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సత్యన్ భార్య వందన మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు