నటీనటులు : శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, షబీర్, బిజూ మీనన్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : సుదీప్ ఎలమన్, సంగీత దర్శకుడు : అనిరుద్ రవిచందర్, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు : శ్రీ లక్ష్మీ మూవీస్, దర్శకుడు : ఎ ఆర్ మురుగదాస్
కథ:
రఘు (శివ కార్తికేయన్) చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో కుటుంబం కోల్పోతాడు. ఇది చూస్తూ ఏమీ చేయలేని రఘు అమ్మా, నాన్న అంటూ అరుస్తూ షాక్ కు గురవుతాడు. దాంతో మానసిక రుగ్మత డిల్యూషన్ సిండ్రోమ్ కి గురవుతాడు. ఇలా 16 ఏళ్ళు ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చిన రఘుకు విచిత్రమైన రీతిలో మాలతి (రుక్మిణి వసంత్) పరిచయం కావడం, ప్రేమగా మారడం జరుగుతాయి.
ఇదిలా వుండగా, మదరాసులో విదేశీ కల్చర్ అయిన తుపాకీ కల్చర్ ను తీసుకురావాలని ఇద్దరు మాఫియా ఫ్రెండ్స్ చిరాగ్ (షబీర్), విరాట్ (విద్యుత్ జమ్వాల్) పెద్ద ప్లాన్ చేస్తారు. ఇది ఎన్ ఐ ఏ. వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఆ క్రమంలో ఎన్ ఐ ఏ అధికారి ప్రేమ్ (బిజూ మీనన్) తన బృందంతో ఆ గన్ కల్చర్ ని ఆపాలని ట్రై చేసి దెబ్బలు తగలడంతో ఆసుపత్రి పాలవుతాడు. అక్కడే ట్రీట్ మెంట్ కు వచ్చిన రఘు తను చనిపోవాలనుందని బిజూమీనన్ ను సాయం అడుతాడు. దాంతో ఐడియా వచ్చి రఘును గన్ మాఫియాను పట్టుకునేందుకు ఎరగా పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఇక మాలతీ ప్రేమ ఏమయింది? అనే విషయాలే మిగిలిన సినిమా.
సమీక్ష:
మురుగదాస్ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా ఇది అయినప్పటికీ కొత్తగా ట్రై చేశారు కానీ అదేమీ అంత కొత్తగా కనిపించదు. విదేశాల్లో గన్ కల్చర్ ఎక్కువ. స్కూల్ పిల్లలు కూడా సరదాగా ఎదుటివారిని కాల్చేస్తుంటారు. అలాంటి సీన్ నుంచి కథను దర్శకుడు ఎత్తుకున్నాడు. అందుకు మెంటల్ డిసాడర్ వున్న పాత్రను హీరోకు ఆపాదించాడు. తెగించినవాడు కాబట్టి తను మాగ్జిమమ్ రెచ్చిపోతుంటాడు.
శివ కార్తికేయన్ అమరన్ లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి ఒక ఊహించని పాత్రని ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది వరకు వచ్చిన సినిమాలు అన్నిటికంటే బహుశా రెమో తర్వాత నటుడుగా తన నుంచి ఒక సాలిడ్ రోల్ ఇది అని చెప్పొచ్చు. నటుడిగా ఈ సినిమాలో కొత్త వెర్షన్ ని తన నుంచి చూడవచ్చు. అలాగే తనపై ఫస్టాఫ్ లో ఎమోషన్స్ కానీ ఫుల్ మూవీ లో యాక్షన్ పార్ట్ కాని సాలిడ్ గా వర్కౌట్ అయ్యాయి.
విద్యుత్ కి నటనకు ఆస్కారం వున్న పాత్రే దక్కింది. మొదటి భాగంకంటే సెకాండఫ్ లో మాత్రం మురుగదాస్ మళ్లీ తుపాకీ రేంజ్ ఫీస్ట్ తనపై అందించాడు. వీరితో పాటు షబీర్ కి మంచి పాత్ర దక్కింది. తన నటనా యాక్షన్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. అలాగే హీరోయిన్ రుక్మిణీ వసంత్ కి సినిమాలో మంచి రోల్ దక్కింది. దాదాపు తనకోసమే అన్నట్టు సినిమా కూడా ఉంటుంది. తన రోల్ కి ఆమె న్యాయం చేసింది. ఇక వీరితో పాటుగా బిజూ మీనన్, పి సీ 2 గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు.
ఈమధ్య అగ్ర హీరోలు ఎవరు చేసిన మాఫియా, డ్రెగ్, వయెలెన్స్ కథలే వుంటున్నాయి. రజనీకాంత్ చిత్రాలు చాలా వున్నాయి. స్టాటింగ్ లోనే గన్ మాఫియా కోసం ఎన్ ఐ ఏ. అధికారుల యాక్షన్ సీన్ తోనే కనిపిస్తుంది. దాంతో కథ ఏమిటో అర్థమయిపోతుంది. ఇదంతా కామన్ మేన్ కు పెద్దగా వర్కవుట్ అయ్యేదిగా కాదు. కొన్ని అలా కాకపోయినా స్టార్ డమ్ తో నెట్టుకు వస్తుంటాయి. కానీ శివకార్తికేయన్ పాత్ర అంత స్కోప్లేదనిపిస్తుంది.
అలాగే యాక్షన్, ఎమోషనల్ పార్ట్ సాధారణంగా వుంటాయి. కొన్ని చోట్ల నాచురల్ గా అనిపిస్తాయి. సో వీటితో తన నుంచి సాలిడ్ ట్రీట్ ని ఆశించే వారికి కొంచెం మిక్స్డ్ ఫీల్ కలుగుతుంది. మొదటి భాగంలో ట్విస్ట్ లు వుండదు. సెకండాఫ్ లో ఏదో వుంటుందనుకుంటే పొరపాటే. దాదాపు క్లయిమాక్స్ ముందు వరకు కథనం రెగ్యులర్ గా సాగుతుంది. పాటలు కూడా ఒకటీ రెండు తప్ప అంత ఇంప్రెసివ్ గా లేవు పైగా ఎక్కువగా కూడా ఉన్నట్లు అనిపిస్తాయి.
నిర్మాణ విలువలు బాగున్నాయి. అనిరుద్ సంగీతం సో.సో.గానే ఉంది. సెకాండఫ్ లో కొన్ని సీన్స్ కి మంచి స్కోర్ ఇచ్చాడు. సుదీప్ ఎలమన్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. కెవిన్ కుమార్ యాక్షన్ పార్ట్ ఇంప్రెస్ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది.
ఫైనల్ గా ఎ ఆర్ మురుగదాస్.. తన వర్క్ అంచనాలు అందుకునే రీతిలో లేదని చెప్పక తప్పదు. ఇంతకుముందు చెప్పినట్టుగా స్టార్ హీరోలకు గన్ కల్చర్ పెట్టేసి దానికి లవ్, యాక్షన్ మిక్స్ చేసి కథలు రాసేయడం జరుగుతుంది. ఇదీ ఆ కోవలోనిదే. మీ ఫోన్ చూసుకోవడానికి కూడా టైం వుండదు అని హీరో స్టేట్ మెంట్ ఇచ్చాడు. అందుకు రివర్స్ గా ఆడియన్స్ థియేటర్లలో కనిపించారు. అసలు కథకు మదరాసి అనేది ఎందుకు పెట్టారనేందుకు.. పూర్వం చెన్నై వారిని మదరాసిలు అని పిలిచేవారని దర్శకుడు చెప్పాడు. కానీ సినిమాలో అంత క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని చోట్ల వరకు కథనం ఓకే కానీ మిగతా కొంతమేర మాత్రం సోసో గానే అనిపిస్తుంది.