నాగపట్టణానికి చెందిన నిత్యానందం అనే వ్యక్తి పట్టణంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు. అతడి కొడుకు ముఖేశ్ అదే ప్రాంతానికి చెందని ఒక యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఆస్తులేమీ లేకపోవడంతో నిత్యానందం కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఈ విషయం చెబితే కొడుకు తనను ఎదిరించి పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడ్డాడు. ఆమె జీవితాన్ని నాశనం చేస్తే కొడుకు పెళ్లి చేసుకోడని ఓ దుర్మార్గపు ప్లాన్ వేశాడు.