బడ్జెట్ ప్రభావం.. స్టాక్ మార్కెట్ మహా పతనం

శనివారం, 1 ఫిబ్రవరి 2020 (16:55 IST)
స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ 2020-21 తీవ్రప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ ఏకంగా 1000 పాయింట్ల మేరకు నష్టపోగా, నిఫ్టీ 300 పాయింట్లు కోల్పోయింది. శనివారం లోక్‌సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే స్టాక్ మార్కెట్‌లో దూకుడు కనిపించింది. కానీ, ప్రసంగం ముగించే సమయానికి ముదుపరులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఫలితంగా మార్కెట్ పతనంలో ముగిసింది. 
 
నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా నష్టపోయి మరోసారి 40 వేల మార్కునకు దిగువన నమోదైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి, అత్యంత కీలకమైన 11,750 మార్కునకు దిగువున నమోదైంది. 
 
ఈ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 900 పాయింట్లు కోల్పోయి ముగిసింది. విత్తమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసిన కారణంగానే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు