ఇందులో భాగంగా గుజరాత్‌లోని గిర్ అడవిలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఒకే ఒక్కడి కోసం ఏర్పాటు చేసింది. ఆసియా సింహాలు మస్తుగా వుండే ఈ అడవిలో 35 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది ఈసీ. ఒక్కడి కోసం ఐదుగురు ఎన్నికల సిబ్బంది, ఇద్దరు ఫారెస్ట్ గార్డులు అడవిలోకి వెళ్లనున్నారు.
నిజానికి భరత్‌దాస్ ఓటేయాలంటే 35 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దీంతో ఎన్నికల సంఘం గుడిలోనే ఆయన కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భరత్ దాస్ ఓటేయగానే.. ఎన్నికల సిబ్బంది అక్కడి నుంచి తట్టా బుట్టా సర్దేసుకుంటుంది. భరత్ దాస్ ఈసారే కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని ఈసీ ఏర్పాటు చేయలేదు. గడిచిన నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో భరత్ దాస్ కోసం గుడిలోనే ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.