విందు ఇచ్చాడు.. కోటీశ్వరుడయ్యాడు.. ఎవరు.. ఎక్కడ..?

సోమవారం, 29 జులై 2019 (14:08 IST)
విందు ఇచ్చాడు.. కోట్లు సంపాదించాడు. అద్భుతమైనా ఆతిధ్యమిచ్చాడు.. ఏక్ దమ్ కోటీశ్వరుడైపోయాడు. అదేంటి విందు ఇస్తే డబ్బులు ఖర్చవ్వాలి.. డబ్బులు ఎలా వస్తాయి అని ఆశ్చర్యపోకండి. తమిళనాడులో అదే జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఓ రైతు దాని నుంచి బయటకు పడ్డానికి విందు భోజనానికి అనూహ్య స్పందన లభించింది.
 
అతను పెట్టిన విందును ఆలకించిన అతిథులు అతన్ని అమాంతం కోటీశ్వరున్ని చేశారు. అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు చదివించి మనసారా ఆశీర్వదించారు. తమిళనాడులోని పుదుక్కోట్ట జిల్లా వడగాడు గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి అనే రైతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. 
 
నిండా అప్పుల్లో మునిగిపోయిన క్రిష్ణమూర్తి గ్రామస్తులకు విందు భోజనం ఏర్పాటు చేశాడు. బంధుమిత్రులు, గ్రామస్తులు కలిపి సుమారు 50 వేల మందిని ఆహ్వానించాడు. అతిథుల కోసం వెయ్యి కిలోల మాంసం రెడీ చేయించాడు. ఏకంగా పదిహేను లక్షలు ఖర్చు చేసి అద్భుతమైన విందు ఇచ్చాడు. ఇక విందును ఆరగించిన అతిథులు తోచిన మొత్తాన్ని ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అతిథులు ఇచ్చిన డబ్బును లెక్కేస్తే బ్యాంక్ అధికారులకే కళ్ళు తిరిగిపోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు