ఏడో అంతస్థు నుంచి దూకేసిన మహిళా టెక్కీ.. ప్రియుడితో బ్రేకప్‌ను..?

మంగళవారం, 3 జనవరి 2023 (17:26 IST)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తొమ్మిది అంతస్తుల భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రథమ్, సార్థక్ సహ ఉద్యోగులు. వీరు స్నేహితులుగా వున్నారు. ఆపై వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఓ దశలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు
 
అయితే అపార్థాల వల్ల వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. బ్రేకప్‌ను హ్యాండిల్ చేయడం ప్రథమ్‌కు కష్టమైంది. ఆమె ఆత్మహత్యకు రెండుసార్లు విఫలయత్నాలు చేసింది. ఆమె తన మూడవ ప్రయత్నంలో భవనం ఏడవ అంతస్థు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న అదే రోజు రాత్రి ఈ ఘోర విషాదం జరగడంతో ఆమె స్నేహితులు షాకయ్యారు. ప్రథమ్‌కు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు