ఇందుకోసం ఆ పార్టీ ఓ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్లు విద్యుత్‌ను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు 38 లక్షల కుటుంబాల విద్యుత్ బకాయి బిల్లులు మాఫీ చేస్తామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. అలాగే, రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, యూపీలో విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఉచిత విద్యుత్ హామీని నెరవేరుస్తామన్నారు.