ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హెచ్‌ఐవి రోగికి ఉపయోగించిన సూదితో గర్భిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్ చేశాడు ఒక భర్త. విడాకులు కావాలంటూ ఈ విధంగా అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహేశ్ గౌతమ్ అలీగఢ్‌లోని ఒక ఆస్పత్రిలోని ల్యాబ్‌లో కాంట్రాక్టు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.