కరోనా వైరస్ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.
పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్ నెంబర్, తప్పుడు అడ్రస్ ఇచ్చారని, పాజిటివ్ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్ మంజూనాథన్ ప్రసాద్ తెలిపారు.