లక్షలాది రూపాయల విలువ చేసే ఈ రోబో అందించే సేవలు అమూల్యమైనవని తెలిపారు. దీన్ని ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పని చేయించవచ్చునని తెలిపారు. కరోన వైరస్ రోగుల దగ్గరికి డాక్టర్లు వెళ్లకుండానే మందులు, ఇతర సామగ్రిని ఈ రోబో ద్వారా అందజేయ వచ్చునని చెప్పారు.
ఈ ప్రయత్నాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అభినందించారని ఈ సందర్భంగా తెలిపారు. రోబో పని తీరును చూసిన జిల్లా కలెక్టర్ ఇటువంటివి మరో నాలుగు రోబోలు జిల్లాకు అవసరమవుతాయని, వాటిని రూపొందించి ఇవ్వమని కోరినట్లు చెప్పారు.