ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆగస్టు 6న బ్యాంక్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రుణ అర్హత కలిగిన వ్యక్తులు, కార్పొరేట్లు, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు చెందిన మొండి బకాయిలు, రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు వ్యక్తిగతమైన పరిష్కార ప్రణాళికలను రూపొందించవలసిందిగా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా రుణ గ్రహీతలకు వివిధ రూపాలలో ఊరట కల్పించడం జరిగిందని చెప్పారు. వడ్డీ రేట్ల మార్పు, వడ్డీ రూపంలో రావలసిన మొత్తాలను మాఫీ చేయడం, జరిమానా వడ్డీ మాఫీ వంటి చర్యలు రుణగ్రహీతలకు ఊరటనిస్తాయని మంత్రి చెప్పారు.