ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హేయమైన దారుణం జరిగింది. ఓ మహిళ గర్భందాల్చింది. కానీ, ఆమె కడుపులో పెరుగుతున్నది ఆడో మగో తెలియాల్సిందేనంటూ కట్టుకున్న భర్త ఘోరాతిఘోరానికి పాల్పడ్డారు. కడుపును కత్తితో నిలువునా చీల్చేశాడు. ఈ దారుణం యూపీలోని బడోవ్ జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బడోవ్ జిల్లాకు చెందిన పన్నాలాల్ అనే వ్యక్తి అప్పటికే ఐదుగురు ఆడపిల్లలకు తండ్రి. ఈక్రమంలో అతని భార్య మరోమారు గర్భందాల్చింది. ఆమెకు నెలలు నిండుతున్న క్రమంలో గర్భంలో పెరుగుతున్నది ఆడో మగో తెలియాల్సిందేనంటూ భర్త పట్టుబట్టాడు. అంతటితో ఆగని ఆ కసాయి.. గర్భంతో ఉన్న భార్య కడుపును కత్తితో నిలువునా చీల్చేశాడు. దీంతో గర్భవతి అక్కడే కుప్పకూలిపోయింది.