భార్యకు కోర్టులో ఉద్యోగం వచ్చిందనీ పెట్రోల్ పోసి...

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (13:14 IST)
ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు కలిసి సంపాదిస్తేనే కుటుంబ పోషణ గగనంగా మారింది. అందుకే అనేక మంది మహిళలు తమ భర్తలకు చేదోడువాదోడుగా ఉండేందుకు తమకు తెలిసిన పనులకు వెళుతుంటారు. అయితే, ఆ మహిళకు ఏకంగా కోర్టులోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త.. భార్యను హత్య చేసేందుకు యత్నించాడు. భార్యను కుర్చీలో కట్టేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ఇరుగుపొరుగువారి సాయంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. 
 
స్థానిక సురేశ్ రాజన్‌ అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈయన భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమెపో కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె..పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు