పరందూరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కావాల్సిందే.. కానీ రైతులకు అండగా ఉంటాం...

ఠాగూర్

సోమవారం, 20 జనవరి 2025 (21:36 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన పరందూరు వద్ద ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కావాల్సిందేనని, అయితే, రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి అండగా ఉండాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ అన్నారు. ఈ విమానాశ్రయానికి వ్యతిరేకంగా నిరసనులు తెలుపుతున్న రైతులు శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. 
 
ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, దేశానికి రైతులే వెన్నెముక అని అన్నారు. ఈ పోరాటంలో తమ పార్టీ చివరి వరకు రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేసారు. తన క్షేత్రస్థాయి రాజకీయాలకు ఈ రైతుల ధర్నా నుంచే నాంది పలుకుతున్నానని విజయ్ పేర్కొన్నారు. 
 
తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అలాగని ఎయిర్‍‌పోర్టును కూడా వద్దనడంలేదని, అయితే, సారవంతమైన సాగుభూమిలో ఎయిర్ పోర్టును నిర్మించడం సబబు కాదని అన్నారు. విమానాశ్రయం నిర్మించేందుకు ఎంచుకున్న ప్రదేశమే సమస్యగా ఉందని మరోచోట ఎయిర్‌పోర్టు నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు