తమిళనాడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెను మార్పులు ఖాయమని నటుడు విశాల్ తెలిపాడు. పందెంకోడి ఫేమ్ విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఒక రాజకీయవేత్తగా తాను పోటీ చేయలేదని... ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని విశాల్ తెలిపాడు. ఆర్కే నగర్ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని విశాల్ వ్యాఖ్యానించాడు.
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరి రాజకీయ ప్రవేశాన్నీ స్వాగతించాడు. వాళ్లిద్దరూ ప్రజలకు మంచి చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే.. ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? అనేది చెప్పలేమని విశాల్ అన్నాడు.
రజనీకాంత్, కమల్ హాసన్‌లలో ఎవరి పార్టీకి ప్రజలు ఓటేస్తారో అంచనా వేయడం కష్టం అన్నాడు. తాను ఇద్దరినీ సమర్థిస్తానని తెలిపాడు. కమల్, రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడుకు మేలే జరుగుతుందని చెప్పాడు.